Share News

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Aug 30 , 2026 | 11:35 PM

వివిధ ప్రాంతాల నుంచి ఆదివారం భక్తులు అధిక సంఖ్యఓ శ్రీశైలానికి తరలివచ్చారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి.

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
స్వామి అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్న భక్తులు

శ్రీశైలం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రాంతాల నుంచి ఆదివారం భక్తులు అధిక సంఖ్యఓ శ్రీశైలానికి తరలివచ్చారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం అమ్మవారికి పల్లకి సేవను వైభవంగా జరిపించారు. ప్రత్యేక పుష్పాలంకరణ చేసిన పల్లకీలో ఆదిదంపతులను ఆశీనులచేసి షోడశోపచార పూజా క్రతువులు నిర్వహించారు. ఆలయ ప్రదక్షిణగా జరిగిన పల్లకీ సేవలో అర్చక వేదపండితులు అర్చక వేదపండితులు అధికారులు పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అలంకార దర్శనాలు కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు రాత్రి 9 గంటలకు పరిమిత టికెట్లను జారీ చేసి దర్శనం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Aug 30 , 2026 | 11:35 PM