Share News

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Aug 01 , 2026 | 11:27 PM

శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. శనివారం సాయంత్రం తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి.

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
శివ నామస్మరణ చేస్తూ దర్శనానికి వెళ్తున్న భక్తులు

శ్రీశైలం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. శనివారం సాయంత్రం తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి. సెలవు రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్వామి వారి గర్భాలయ స్పర్శ దర్శనాలు కేవలం ఆన్‌లైన్‌ ద్వారా ముందుగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే కల్పిస్తూ మిగతా వారికి ఉభయ దేవాలయాల్లో అలంకార దర్శనాలు అందు బాటులో ఉంచుతున్నట్లు అలయ అధికారులు తెలిపారు. శని, ఆది, సోమవారాల్లో అభిషే కాలు, కుంకుమార్చనలు తాత్కా లికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. క్షేత్రానికి వచ్చే యా త్రికులు దేవదాయశాఖ అధికారిక వెబ్‌సైట్‌, మనమిత్ర వాట్సప్‌ ద్వారా వసతి గదులు, ఆర్జిత సేవా టికెట్లను ముందుగానే నమోదు చేసుకోవడంతో ఇబ్బందులు పడకుండా ఉం డవచ్చునని ఈవో శ్రీనివాసరావు కోరుతున్నారు. ఆలయ దర్శనాల కోసం కంపార్టుమెంట్లు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరా యంగా అల్పాహారాలు, మజ్జిగ, పాలు, తాగునీరు వంటివి శివసేవకులతో అందిస్తున్నారు.

Updated Date - Aug 01 , 2026 | 11:27 PM