శ్రీమఠానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:28 PM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు గురువారం పోటెత్తారు. నూతన సంవత్సరం కావ టంతో దేశనలుమూలలు నుంచి లక్షలాది మంది భక్తులు వరదలా తరలివ చ్చారు.
మంత్రాలయం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు గురువారం పోటెత్తారు. నూతన సంవత్సరం కావ టంతో దేశనలుమూలలు నుంచి లక్షలాది మంది భక్తులు వరదలా తరలివ చ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారు జామునుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది. 2026 ప్రారంభం కావడంతో గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు తమ వాహనాలను హైవే రోడ్‌పై పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్‌లో ఇరుక్కొని ఇబ్బందులుపడ్డారు.