Share News

శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:52 PM

శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదిదంపతులను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు.

శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
మల్లన్న దర్శనానికి బారులుదీరిన భక్తులు

శ్రీశైలం, మహానందిలో వైభవంగా కార్తీక మాసోత్సవాలు

శ్రీశైలం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదిదంపతులను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. సుమారు 45 వేల మంది భక్తులు ఉభయ దేవాలయాల్లో దర్శనాలు చేసుకున్నట్లు ఆలయ అధికారుల తెలిపారు. నిత్యం జరిగే ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతుండగా శని, ఆది, సోమవారాల్లో అందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. తొలి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలతోపాటు సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, దశవిధ హారతుల కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్‌నాయుడు, ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం ఎదురుగా ఉన్న మైదానంలో ఈనెల 20న కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మహానంది క్షేత్రంలో..

మహానంది: మహానంది క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దేవస్థానానికి చెందిన వసతి గృహాలు శనివారం సాయంత్రమే నిండిపోవడంతో సమీపంలోని ప్రైవేట్‌ వసతి గృహాల్లో భక్తులు విశ్రాంతి తీసుకున్నారు. ఆదివారం వేకువజాముననే ఆలయ ప్రాంగణంలోని కోనేర్లల్లో పుణ్య స్నానాలు ఆచరించి పరమశివుడిని గంటల కొద్ది నిల్చొని దర్శనం చేసుకున్నారు. మహిళా భక్తులు పరిసరాల్లో భక్తి రఽశద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు.

Updated Date - Nov 15 , 2026 | 11:52 PM