మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:52 PM
మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావటంతో దక్షణాది రాష్ర్టాల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు.
మంత్రాలయం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావటంతో దక్షణాది రాష్ర్టాల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహా ముఖద్వారం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రోడ్లు, రాఘవేంద్ర సర్కిల్, నదీతీరం భక్తులతో సందడిగా మారింది. గ్రామదేవత మంచా లమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొ క్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీమఠం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.
తెలుపు రంగులోకి పరిమళ ప్రసాదం
శ్రీ మఠంలో భక్తులకు విక్రయించే పరిమళ ప్రసాదం రంగును మార్చారు. రెండు రోజుల నుంచి చాతుర్మాసం ఆఖరి శాఖావ్రతంను పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆదేశాల మేరకు కాషాయ రంగులో తయారుచేసే పరిమళ ప్రసాదంను తెలుపు రంగులోకి మార్చారు. నెల రోజుల వరకు పరిమళ ప్రసాదం తెలుపు రంగులో ఉంటుందని మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, శ్రీపతి ఆచారులు తెలిపారు. ద్విదళ బీజ వ్రతం ప్రారంభం కావడంతో కాషాయ రంగు నెలరోజుల పాటు నిషేధం ఉంటుందన్నారు. ప్రసాదంలో రంగు మార్పును భక్తులు గమనించి రాఘవేంద్ర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.