Share News

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:19 PM

ప్రముఖ పుణ్య క్షేత్ర మైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ధర్శనార్థం వచ్చిన భక్తులతో సందడి గా మారింది.

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు
భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీమఠం ప్రాంగణం

మంత్రాలయం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్య క్షేత్ర మైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ధర్శనార్థం వచ్చిన భక్తులతో సందడి గా మారింది. రెండవ శనివారం, ఆదివారం వరుస సెలవుదినాలు కావటంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నదితీరం భక్తులతో కోలాహాలంగా మారింది. తుం గభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాల మ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

Updated Date - Jun 13 , 2026 | 11:19 PM