Share News

రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:35 AM

: ప్రజల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని, రెండేళ్లలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టించినట్లు ఎమ్మెల్యే కోట్ల, పరిశీలకుడు గోవర్దన్‌ రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని ఒకటో వార్డులో ‘ఇంటింటికీ టీడీపీ’ నిర్వహించారు. రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ది పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు

రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు
కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోట్ల

డోన్‌, బనగానపల్లె, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఇంటింటికి టీడీపీ

డోన్‌ టౌన్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ప్రజల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని, రెండేళ్లలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టించినట్లు ఎమ్మెల్యే కోట్ల, పరిశీలకుడు గోవర్దన్‌ రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని ఒకటో వార్డులో ‘ఇంటింటికీ టీడీపీ’ నిర్వహించారు. రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ది పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చి హామీ మేరకు సిక్స్‌ పథకాలు అమలు చేశమన్నారు. పింఛన్లను రూ.4 వేలు, రూ.6వేలు, రూ.10వేలు, రూ.15వేలకు పెంచడంతో పాటు ఇంట్లోని పిల్లలందరికీ తల్లికి రూ.15వేలు, దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్లకు ఏటా రూ.15వేలు, అన్నదాత సుఖీభవ కింద రైతుకు రూ.20వేలు ఇస్తున్నామన్నారు. అలాగే అన్న క్యాంటీన్ల ఏర్పాటు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దుచేసి, రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ద శూన్యమన్నారు. మాజీ జడ్పీటీసీ కేఈ జయన్న, జిల్లా ఉపాధ్యక్షుడు సలీంధ్ర శ్రీనివాసులు యాదవ్‌, కోట్రికే ఫణిరాజ్‌, పట్టణ అధ్యక్షులు టీఈ రాఘవేంద్రగౌడు, కేఈ వేణు, పెద్ద కేశవయ్యగౌడు, శేషఫణిగౌడు, ఓబులాపురం శేషిరెడ్డి, బీజేపీ నాయకులు సందు వెంకటరమణ, సుదీష్‌ పాల్గొన్నారు.

బనగానపల్లె: టీడీపీ ప్రభుత్వంతోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని నియోజకవర్గ పరిశీలకురాలు పర్వీన్‌బాను పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం ప్రాంతంలో ప్రజలకు పథకాలను వివరించి, కరపత్రాలు పంపిణీ చేశారు. మంత్రి బీసీ హయాంలో పట్టణంలో రింగ్‌రోడ్డు నిర్మణం పనులు వేగంగా చేస్తున్నారని, రూ.400కోట్లతో సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మిస్తున్నారని తెలిపారు. అలాగే దూదేకుల కార్పోరేషన్‌ డైరక్టర్‌ ఖాసింబాబు, బురానుద్దీన్‌, మైనార్టీసెల్‌ అధ్యక్షుడు రాయలసీమ సలాం, అబబ్దుల్‌ కలాం, అహమ్మద్‌హుసేన్‌ పట్టణంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. రెండేళ్ల పాలనలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ టీడీపీశ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

రుద్రవరం: చందలూరు గ్రామంలో ఆళ్లగడ్డ పరిశీలకుడు దేవెళ్ల మురళి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ నిర్వహించారు. అమరావతి రాజధానిని 50వేల ఎకరాల్లో నిర్మిస్తున్నారని వివరించారు. గొడ్డలి పార్టీ నాయకులు ఎంతమంది వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగింంచాలని కార్యకర్తలను కోరారు. సౌరెడ్డి నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 12:35 AM