11 నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:17 AM
పాతనగరంలోని జమ్మిచెట్టు సమీపంలోగల లలితా పీఠంలో ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పీఠాధిపతి గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి తెలిపారు.
కర్నూలు కల్చరల్, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): పాతనగరంలోని జమ్మిచెట్టు సమీపంలోగల లలితా పీఠంలో ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పీఠాధిపతి గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి తెలిపారు. శనివారం లలితా పీఠంలో భక్తులతో కలిసి ఉత్సవాల వివరాలు తెలియజేసే ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. పీఠాధిపతి మాట్లాడుతూ ప్రతి ఏటా దసరా వేడుకను పురస్కరించుకొని నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని, లలితా పీఠంలతోని లలితాదేవికి తొమ్మిది రోజుల పాటూ విశేష అలంక రణలు, ప్రత్యేక పూజలు, హోమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా పీఠంలో శ్రీదేవీ, భూదేవీ వేంకటేశ్వర స్వామి వార్ల నవరాత్ర మహోత్సవాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.