Share News

టీడీపీతోనే అభివృద్ధి, సంక్షేమం

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:29 AM

టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ది, సంక్షేమం సాధ్యమని రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు.

టీడీపీతోనే అభివృద్ధి, సంక్షేమం
అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

కొలిమిగుండ్లలో అభివృద్ధి పనుల ప్రారంభం

కొలిమిగుండ్ల, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ది, సంక్షేమం సాధ్యమని రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి మండల కేంద్రంలో ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలలో జరిగిన రూ 4.59 కోట్ల అభివృద్ది పనులను హైస్కూల్‌ బహిరంగ సభ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడు తూ గత వైపీపీ హయాంలో రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడిందని, టీడీపీ పాలనతో తిరిగి అభివృద్ధి వికసించిందన్నారు. ఎన్నికల ముందు మాట ఇచ్చిన విధంగా సూపర్‌ సిక్స్‌ హమీలను సూపర్‌ హిట్‌ చేశామని, దేశంలోనే అత్యంత సంక్షేమం అందిస్తున్న రాష్ట్రం మనదేనన్నారు. ఇంట్లో పిల్లలందరికి అమ్మఒడి అందించామని, దీపం పథకం కింద మూడు సిలిండర్లు, అన్నదాత సుఖీభవ నిధులు, స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు, దివ్యాంగులకు ఫించన్‌ పెంపు, చేనేత కార్మికులు, ఎస్సీలకు ఉచిత విద్యుత్‌, ఇంటి వద్దకే పాలన అందిస్తునట్లు పేర్కొన్నారు. ఏడాదిన్నరలోనే మండలంలో రూ.9 కోట్ల పనులు చేసినట్లు వివరించారు. అభివృద్దిద్ధిని వైసీపీ నాయకులు ఓర్వలేక రప్పారప్పా అంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. జలజీవన్‌ కింద నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. రామ్‌కో, అలా్ట్రటెక్‌ సిమెంట్‌ పరిశ్రమలను టీడీపీ ప్రభుత్వం తెచ్చిందని, దీంతో వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిచిందన్నారు. త్వరలో రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకో డానికి నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషి చేయలన్నారు. నంద్యాల రామేశ్వర్‌ రెడ్డి, మూలే రామేశ్వర్‌ రెడ్డి, వీఆర్‌ లక్ష్మీరెడ్డి, ఉలవల నరసింహుడు, గూలి నాగేశ్వర్‌ రెడ్డి, హుస్సేన్‌ రెడ్డి, వివేకానంద రెడ్డి, రవి ప్రకాష్‌రెడ్డి, అధికారులు, ఎంపీడీవో, ఉద్యోగులు పాల్గొన్నారు

Updated Date - Apr 12 , 2026 | 12:29 AM