Share News

రూ.2.50 కోట్లతో అభివృద్ధి పనులు

ABN , Publish Date - Mar 20 , 2026 | 01:20 AM

క్రీడాకారులు, వాకర్స్‌ అసోసియేషన కోరిక మేరకు అవుట్‌డోర్‌ స్టేడియంలో రూ.2.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

రూ.2.50 కోట్లతో అభివృద్ధి పనులు
శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న మంత్రి టీజీ భరత

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

కర్నూలు స్పోర్ట్స్‌, మార్చి 19(ఆంధ్రజ్యోతి): క్రీడాకారులు, వాకర్స్‌ అసోసియేషన కోరిక మేరకు అవుట్‌డోర్‌ స్టేడియంలో రూ.2.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక అవుట్‌డోర్‌ స్టేడియంలో పికిల్‌ బాల్‌ కోర్టులు, వాలీబాల్‌ కోర్టుల, వాకింగ్‌ ట్రాక్‌లను రూ.2.50 కోట్లతో అంతర్జాతీయ స్థాయిల సింథటిక్‌ ఫ్లోరింగ్‌ వేయించే కార్యక్రమాలకు మంత్రి టీజీ భరత శంకుస్థాపన చేశారు. మంత్రి టీజీ భరత మాట్లాడుతూ నేను గతంలో ఇదే స్టేడియంలో క్రీడలు ఆడటానికి వచ్చేవాడినని, తాము క్రీడలపై చిత్తశుద్ధితో అభివృద్ధి పనులు చేస్తుందన్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ అవుట్‌డోర్‌ స్టేడియంలో గడ్డి పెంచి ఆకుపచ్చ స్టేడియంగా మార్చడానికి తన ఎంపీ నిధుల నుంచి రూ.15 లక్షలు విడుదల చేస్తానని, కర్నూలు సి.క్యాంపులో ఉన్న 67 ఎకరాల స్థలంలో పదెకరాలు హైకోర్టు బెంచ ఏర్పాటుకు కేటాయించడం, మిగిలిన స్థలంలో కొత్త కలెక్టర్‌ కార్యాలయం, మంచి పార్కు, ఇతర అభివృద్ధి పనులకు ముఖ్య మంత్రి దగ్గర అనుమతి తీసుకున్నామన్నారు. కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మంత్రి టీజీ భరత జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నారన్నారు. మున్సిపల్‌ కమి షనర్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ మంత్రి సూచనల మేరకు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ సమావేశానికి డీఎస్‌డీవో భూపతిరావు, హజ్‌కమిటీ మెంబర్‌ ఆలీఖాన, ఎంఎస్‌ ఎంఈ డైరెక్టర్‌ కౌశిక్‌, నాయకులు సిటీ నాగరాజు, ప్రవీణ్‌, గాజుల భాస్కర్‌, స్టేడియం సిబ్బంది, వాకర్స్‌ అసోసియేషన సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 01:20 AM