Share News

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాలి

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:33 AM

నగర అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుని వెళ్లాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాలి
అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న మంత్రి టీజీ భరత

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): నగర అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుని వెళ్లాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. మంగళవారం స్థానిక నగర పాలక సమావేశ భవనంలో హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌(హెచఏఎం) కింద రూ. 246 కోట్లతో నగర పాలక సంస్థ, గూడూరు, ఆదోని, ఎమ్మిగనూరు, ప్రాంతాల్లో చేపట్టనున్న పార్కులు, స్ట్లీట్‌ లైట్లు, సెంట్రల్‌ మెరీడియన, రోడ్లు, తదితర అభివృద్ధి పనులను కుప్పం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా కార్యక్రమా న్ని మంత్రి టీజీ భరత, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్‌ సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలు వీక్షించారు. మంత్రి టీజీ భరత మాట్లాడుతూ అభివృద్ధి పనులను ముందుగానే సమీక్షించడం, అవసరమైన చర్యలను ముందస్తుగా చేపట్టడం వల్ల చివరి నిమిషం లో ఎదురయ్యే సమస్యలను నివారించవచ్చని అన్నారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు పట్టణాన్ని స్మార్ట్‌ సిటీ తరహాలో ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ గతంలో పాణ్యం నియోజకవర్గ పరిధిలో 16 వార్డులు ఉండగా ప్రస్తుతం పునర్విభజనతో 22 వార్డులకు విస్త రించిందన్నారు. గతంలో 2014-19 మధ్య 16 వార్డులకు సుమారు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం లో నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన చైర్మన పార్వతమ్మ, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ ప్రజాప్రతి నిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 12:33 AM