Share News

కూటమితోనే అభివృద్ధి

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:16 AM

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

కూటమితోనే అభివృద్ధి
ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, గౌరు జనార్దనరెడ్డిలను గజమాలతో సన్మానిస్తున్న కొంగనపాడు టీడీపీ నాయకులు

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

వైసీపీని వీడి టీడీపీలోకి..

కల్లూరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. బుధవారం టీడీపీ నాయకుడు టి.వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో కొంగన పాడు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులు ఎమ్మె ల్యే గౌరు చరితారెడ్డి, గౌరు జనార్ధనరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఏళ్లకృష్ణ, ప్రభుదాస్‌, చంద్రన్న, ఆనంద్‌, రాజేష్‌, రాంబాబు, మాదన్నలకు గౌరు చరిత టీడీపీ కండు వాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం, గౌరు దంపతులు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులపై టీడీపీలో చేరామని వారన్నారు.

ఎమ్మెల్యేకు ఘన సన్మానం: కొంగనపాడు గ్రామ సర్పంచుగా ఏకగ్రీవంగా ఎన్నికైన టి.నాగయ్య, టీడీపీ నాయకుడు టి.వినోద్‌ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితను ఘనంగా సన్మానించారు. మాధవీ నగర్‌ క్యాంపు కార్యాలయంలో గజమాల వేసి శాలువాలతో సన్మానిం చారు. ఈసందర్భంగా టీడీపీ నాయకుడు వినోద్‌కుమార్‌ను అభినం దించారు. పాణ్యం నియోజకవర్గ పరిశీలకుడు చల్లా లక్ష్మీప్రసాద్‌, మాజీ ఎంపీటీసీ లక్ష్మన్న, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2026 | 12:16 AM