పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధి
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:10 AM
పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఓర్వకల్లు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని లొద్దిపల్లె, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. లొద్దిపల్లె గ్రామంలో జల్‌జీవన మిషన-2.0 కింద రూ.30 లక్షలతో చేపట్టబోతున్న తాగునీటి పైపులైన బోరుకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఉయ్యాలవాడ గ్రామంలో కొండపై వెలసిన లక్ష్మీ వేంకటే శ్వరస్వామి ఆలయానికి వెళ్లే రహదారి నిర్మాణానికి టీటీడీ నిధులు రూ.1.83 కోట్లతో చేపట్టనున్న పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పల్లె పండుగ 1, 2 ఎనఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.70 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. పల్లెపండుగ 3 కింద రూ.20లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను భూమి పూజ చేసి మరో రూ.40 లక్షలతో నిర్మించిన హెల్త్ క్లినిక్ సెంటర్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గంలో పల్లె పండుగ ద్వారా రూ.37.97 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామ న్నారు. ఓర్వకల్లు మండలాన్ని ఇండస్ర్టియల్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల సంస్థ డైరెక్టర్ నాగముని, మండల స్పెషల్ ఆఫీసర్ సునీల్ కుమార్, ఎంపీడీవో నాగ అనసూయ, ఏఈ సురేంద్ర రెడ్డి, శ్రీనివాసులు, ఈవోలు చంద్రశేఖర్ రెడ్డి, మద్దిలేటి, నన్నూరు సొసైటీ అధ్యక్షులు నాగేశ్వరరెడ్డి, గోవిందరెడ్డి, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, లక్ష్మణ రావు, నాగేశ్వరరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.