పల్లె దారులకు మహర్దశ
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:23 AM
ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని గ్రామీణ రహదారులకు మహర్దశ వచ్చింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి మండలంలోని మూడు రహదారుల నిర్మాణనానికి రూ.81.5కోట్లు నిధులు మంజూరు చేశారు
రూ.81.5కోట్లు కేటాయించిన మంత్రి బీసీ
హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, ప్రజలు
కొలిమిగుండ్ల, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని గ్రామీణ రహదారులకు మహర్దశ వచ్చింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి మండలంలోని మూడు రహదారుల నిర్మాణనానికి రూ.81.5కోట్లు నిధులు మంజూరు చేశారు ఈనెల 20న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘మట్టి రోడ్లు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. మండలంలో 3 గ్రామాల రహదారుల విస్తరణ, అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. కొలిమిగుండ్ల పెట్నీకోట వయా మీర్జాపురం 12.6కి.మీ డబుల్‌లైన్ రహదారికి రూ.30 కోట్లు, తిమ్మనాయినిపేట-అంకిరెడ్డిపల్లె 13.8 కి.మీ విస్తరణకు సంభంధించి రూ.29కోట్లు, బనగానపల్లె-నందివర్గం వయా ఎస్.కొత్తూరు 10.6కి.మీల రహదారి విస్తరణకు రూ.22.5 కోట్లతో పనులు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది.
సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని రహదారుల రూపురేఖలు మారనుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మట్టి, గుంతల రోడ్లలో పడుతూ లేస్తూ ప్రయాణించిన తవ ఇబ్బందులు తీరయని వాహనదారులు, రైతులు అంటున్నారు.
రహదారి నిర్మాణం హర్షణీయం
పెట్నీకోట - పేరుసోముల రహదారి విస్తరణతో ప్రయాణ సౌకర్యం సులువు కావడంతో కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాల ప్రజల బంధాన్ని పెంచుతుంది. వాహనదారులు, రైతుల రాకపోకలకు అనువుగా మారే అవకాశం ఉంది. - పోరెడ్డి చిన్నపురెడ్డి, మీర్జాపురం
టీడీపీ హయాంలో అభివృద్ధి
అంకిరెడ్డిపల్లె-తిమ్మనాయినిపేట రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం ఆనందం కలిగిస్తోంది. ఏళ్లుగా రోడ్డు శిథిలమైన రహదారిని బాగుచేస్తున్న తెలుగు దేశం ప్రభుత్వానికి మంత్రి బీసీకి కృతజ్ఞతలు. - రవిప్రకా్‌షరెడ్డి అంకిరెడ్డిపల్లె