Share News

రాష్ట్రంలో 22వేల పాఠశాలల అభివృద్ధి

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:14 PM

‘మనబడి-మన భవిష్యత్తు’ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22వేల పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ) మువ్వా రామలింగం అన్నారు.

 రాష్ట్రంలో 22వేల పాఠశాలల అభివృద్ధి
ఎంఎస్‌ జడ్పీ బాలికోన్నత పాఠశాలను పరిశీలిస్తున్న జేడీ మువ్వా రామలింగం

పాఠశాల మౌలిక వసతుల కల్పన జేడీ మువ్వా రామలింగం

ఎమ్మిగనూరు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ‘మనబడి-మన భవిష్యత్తు’ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22వేల పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ) మువ్వా రామలింగం అన్నారు. శనివారం పట్టణంలోని మాచాని సోమప్ప జడ్పీ బాలికోన్నత పాఠశాలను, అదే ఆవరణంలో ఉన్న జడ్పీ ఉర్దూ పాఠశాలను ఆయన పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో నాడు-నేడు రెండో ఫేస్‌ కిం ద చేపట్టిన పనులను 2023-24లో పూర్తికావాల్సి ఉందన్నారు. అవి పూర్తి కాలేదన్నారు. ఈపాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఈ ఏడాది చర్యలు తీసుకుందన్నారు. 1000మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉన్న పాఠశాలలు రాష్ట్రంలో 60ఉన్నాయని ఇందులో కర్నూలు జిల్లాలో 20వరకు ఉన్నాయన్నా రు. ఎమ్మిగనూరులో ఎంఎస్‌ జడ్పీ బాలికోన్నత పాఠశాలలో 3500మంది విద్యార్థినులు చదువుతున్నారన్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం లీప్‌ స్కీం కింద రూ.20కోట్లతో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల సమావేశంలో జేడీ మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా మీ పాఠశాలలో విద్యార్థినుల సంఖ్య గణనీయంగా ఉందని, దీన్ని కాపాడుకోవాలన్నారు. మువ్వాను టీచర్లు, కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. డీఈవో ఎల్‌ సుధాకర్‌, ఏపీసీ లోక్‌నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 11:14 PM