Share News

అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:33 PM

సోషల్‌ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ జిల్లా అఽధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ సూచించారు.

అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

ఐటీడీపీ నాయకులతో సమావేశం

కర్నూలు అర్బన్‌ , సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ జిల్లా అఽధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ సూచించారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఐటీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ... సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం కల్పించేందుకు ప్రతి గ్రామం నుంచి ఇద్దరు సభ్యులతో గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి, పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల స్థాయిలో ఐటీడీపీ ద్వారా పార్టీ కార్యాక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యచరణ రూపొందించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జుల సహకారంతో ఐడీటీపీ కమిటీలను ఏర్పాటును పూర్తి చేసి రానున్న రోజుల్లో సోషల్‌ మీడియా వేదికగా పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో ఐడీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్‌, నాయకులు జి. రామాంజనేయులు, హెచ్‌. నాగరాజు, బి. కృష్ణనాయుడు, వీరేష్‌, చిదానంద. సయ్యద్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:33 PM