అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:20 AM
అభివృద్ధి, సంక్షేమమే కూట మి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే కూట మి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. సోమవారం కల్లూరు అర్బన 35 వార్డు చింతలము నినగర్, గని గుంతలు, శివప్పనగర్లో రూ.70లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం 32వ వార్డులో రెండేళ్ల నమ్మ కం-అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ పథకాలు అ మలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు. కార్యక్రమంలో పాణ్యం టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.ఫిరోజ్, నాయకులు రవి ప్రకాష్‌రెడ్డి, టైలర్ నాగరాజు, ఎన్వీ రామకృష్ణ పాల్గొన్నారు.