అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jun 12 , 2026 | 01:15 AM
అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ సలహా మండలి సభ్యుడు వెంకటపతి అన్నారు.
తుగ్గలి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ సలహా మండలి సభ్యుడు వెంకటపతి అన్నారు. గురువారం చెన్నంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులుబురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండపిడ్డారు. రెండేళ్ల కాలంలోనే చెన్నంపల్లి పంచాయతీలోని చెన్నంపల్లి, కేపీ గుడిసెల, రామలింగాయపల్లె గ్రామాల్లో రూ.4 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మాణం చేపట్టడంతో పాటు తాగునీటి పథకాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. మాజీ ఎంపీపీ కొమ్మె వెంకటేశ్, మాబాషా, లక్ష్మినారాయణ చౌదరి, శభాష్‌వలి, కోటేష్‌గౌడు, అక్బర్, హుశేన్, శీనప్ప పాల్గొన్నారు.