అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:11 AM
అభివృద్ధే తమ లక్ష్యమని కేడీసీసీబీ చైర్మన విష్ణువర్ధనరెడ్డి అన్నారు.
కేడీసీసీబీ చైర్మన విష్ణువర్ధనరెడ్డి
కోడుమూరు రూరల్, మార్చి 25(ఆంధ్రజ్యోతి): అభివృద్ధే తమ లక్ష్యమని కేడీసీసీబీ చైర్మన విష్ణువర్ధనరెడ్డి అన్నారు. బుధవారం రాత్రి గోరంట్ల మజారా కొత్తపల్లి గ్రామంలో ఆరె మరాఠాలకు కుల ధ్రువీ కరణ పత్రాల అందించే కార్యక్రమానికి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తోపాటు కేడీసీసీబీ చైర్మన హాజర య్యారు. ఈ సందర్భంగా గ్రామ స్థులు వారికి ఘన స్వాగతం పలికారు. విష్ణువర్ధనరెడ్డి మాట్లాడుతూ ఆరె మరాఠాలకు కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో సంక్షేమ పథకాలు, ఉద్యోగావకాశాలు పొందలేకపోతున్నార న్నారు. గత 30 ఏళ్లుగా కులధ్రువీకరణ పత్రాలు లేవన్న విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం చొరవతో కులధ్రువీకరణ పత్రాలు మంజూరైనట్లు తెలిపారు. గోరంట్ల-కొత్తపల్లి రోడ్డు పూర్తయ్యిందని, మధ్యలో పనులు నిలిచిన వంతెన కూడా పూర్తి చేయించి ప్రజల కోరిక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
ఆరె మరాఠాల్లో శివాజీ స్ఫూర్తి: ఎమ్మెల్యే దస్తగిరి
ఆరె మరాఠాల్లో శివాజీ స్ఫూర్తి ఉందని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. ఎన్నో ఏళ్లుగా కులధ్రువీకరణ పత్రాలు లేని ఆరె మరాఠాల జీవితాల్లో పండుగ వచ్చిందన్నారు. అనంతరం కేడీసీసీబీ చైర్మన, ఎమ్మెల్యే లబ్ధిదారులకు పత్రాలు అందించారు. కార్యక్రమంలో తహసీ ల్దార్ నాగరాజు, ఆర్‌ఐ అశోక్, సర్పంచ బాలకృష్ణ టీడీ ష్ణ నాయకులు మధుసూదన నాయుడు, ఆంజనేయులు, గిడ్డయ్య, రాధాకృష్ణ, సద్దల శీను, బాలమద్ది, చిన్నరాముడు, రామచంద్రుడు, బాలచంద్రుడు, ప్రసా దరావు, అంతప్ప, రాముడు పా
ల్గొన్నారు.