Share News

అభివృద్ధే కూటమి లక్ష్యం : మంత్రి

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:26 AM

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ అన్నారు.

అభివృద్ధే కూటమి లక్ష్యం : మంత్రి
బీటి రోడ్డును శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి ఫరూక్‌

గోస్పాడు, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ అన్నారు. మండలంలోని గోస్పాడు నుంచి జిల్లెల్ల మీదుగా కామినేనిపల్లె వరకు రూ 3 కోట్లతో వేసిన బీటి రోడ్డును సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైపీసీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఒక్క అభివృద్ధ్ది పని కూడా జరగలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ సీసీ రోడ్లు, డ్రైనేజీ, పేదలకు పక్కా ఇళ్లతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని అన్నారు. ప్రజలు ఇలాంటి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.

Updated Date - Jul 21 , 2026 | 12:26 AM