Share News

కోవెలకుంట్ల పట్టణాభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:43 AM

కోవెలకుంట్ల పట్టణాభివృద్ధే లక్ష్యమని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. పలు వీధుల్లో అండర్‌ డ్రైనేజీ, సీసీ రోడ్లు పరిశీలించారు.

కోవెలకుంట్ల పట్టణాభివృద్ధే లక్ష్యం
అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను పరిశీలిస్తున్న మంత్రి బీసీ

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

కోవెలకుంట్ల, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): కోవెలకుంట్ల పట్టణాభివృద్ధే లక్ష్యమని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. పలు వీధుల్లో అండర్‌ డ్రైనేజీ, సీసీ రోడ్లు పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్ధులతో పాటు చుట్టూపక్కల కాలనీ వాసులకు ఐదు వేల లీటర్ల సామర్థ్యం గల మినరల్‌ వాటర్‌ ప్లాంటును ఏర్పాటు చేయించి తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. పక్కీర్‌పేట, చౌడేశ్వరి దేవి ఆలయం, సంతపేట, జెండా చెట్టు వీధి, స్కంద వీధి తోపాటు ఎస్‌ఎల్‌వీటీ టాకీస్‌ వెనుక భాగాన ఉన్న సీసీ రోడ్డును, అయ్యప్ప స్వామి గుడి వీధిలో జరగుతున్న అండర్‌ డ్రైనేజీ పనులను పరిశీలించారు. సాయంత్రం 4గంటల నుంచి 7గంటల వరకు కాలినడక న పలు వీధుల్లో పర్యటించారు. కార్యక్రమంలో బనగానపల్లె మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ కాట్రెడ్డి మల్లికార్జున్‌ రెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్‌ఏ గఫూర్‌, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ గడ్డం నాగేశ్వర్‌రెడ్డి, వల్లంపాడు జగదీశ్వర్‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ ఎంిపీడీవో ప్రకాష్‌ నాయుడు, విద్యుత్‌ ఏడీ సతీష్‌ కుమార్‌రెడ్డి, ఏవో సుధాకర్‌ రెడ్డి, ఏఈ రాంమోహణ్‌ రెడ్డి, గాధంశెట్టి రమణయ్య, చిట్టి, పెనుగొండ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:43 AM