Share News

కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:19 AM

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తెలుగు దేశం పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు

కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి
జూనూతల గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న మంత్రి బీసీ

అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి బీసీ

బనగానపల్లె, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తెలుగు దేశం పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు. శనివారం సాయంత్రం అవుకు మండలం జూనూతల, కొండమనాయునిపల్లె గ్రామాల్లో అభివృద్ది పనులను ప్రారంభించారు. కొండమనాయునిపల్లె ఎస్టీ కాలనీలో జూనూతల, పిక్కిళ్లపల్లె తండాలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను మంత్రి ప్రారంభించారు. కొండమనాయునిపల్లెలో మంత్రి సొంత నిధులు రూ.8 లక్షలతో నిర్మించిన మినరల్‌ వాటర్‌ ప్టాంట్‌ను ప్రారంభించారు. రూ.9 కోట్లతో అవుకు నుంచి గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని, జలజీవన్‌ మిషన్‌ కింద రూ.510 కోట్లతో రిజర్వాయర్‌నుంచి ఇంటింటికి తాగునీరు ఇస్తామన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని, ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షహోదా లేకుండా చేసినా సిగ్గురావడం లేదన్నారు. ఫొటోల పిచ్చితో రూ.కోట్ల ప్రజాధనాన్ని జగన్‌ దుర్వినియోగం చేసి, రాష్ట్రాన్ని గుంతలమయంగా మార్చారని, టీడీపీ ప్రభుత్వం రూ.3వేల కోట్లతో రహదారులను అభివృద్ధి చేసిందన్నారు. అమరావతి, పోలవరం, నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. అభివృద్ధిపై చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే కాటసానికి సవాల్‌ విసిరారు. ఎం.వెంకటేశ్వర్లు, పి. వెంకటేశ్వర్లు, శ్రీరాం, ఎద్దుల శివారెడ్డి, విశ్వనాథరెడ్డి, సీమరాథోడ్‌, ఇస్మాయిల్‌ఖాన్‌, రాష్ట్ర కార్యదర్శులు చల్లా విజయభాస్కర్‌రెడ్డి, కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ కాట్రెడ్డి మల్లిఖార్జునరెడ్డి, ఉగ్రసేనారెడ్డి, మొట్ల రామిరెడ్డి, మారంపుల్లారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2026 | 12:19 AM