అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా ఆళ్లగడ్డ
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:24 AM
ఆళ్లగడ్డ నియోజక వర్గం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
వంతెన, సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అఖిలప్రియ, కలెక్టర్ రాజకుమారి
ఆళ్లగడ్డ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ నియోజక వర్గం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారం జి.జంబులదిన్నె గ్రామంలో పల్లె పండుగ 3.0 కింద రూ.60లక్షలతో నిర్మించిన రెండు వంతెనలు, సీసీ రోడ్లు, కొటకందుకూరులో రూ.40లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, విలేజ్ హెల్త్‌క్లినిక్‌ను కలెక్టర్ రాజకుమారితో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అళ్లగడ్డ అంటే ఒకప్పుడు మరోలా ఉండేదని టీడీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందన్నారు. గతంలో పట్టణంలోని నిర్వహించిన గ్రీవిన్స్‌లో ప్రజలు అర్జీలు ఇవ్వడంతో కలెక్టర్ నిధులు మంజూరు చేశారన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ గ్రామంలో అంతిమసంస్కారాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడేవారని తెలిపారు. పీజిఆర్‌ఎస్ నిర్వహణకు వరుసగా నాలుగు వారాలు ఆళ్లగడ్డకు వచ్చామని తాగునీటి సమస్యలు, రహదారుల సమస్యలు తెలిపారన్నారు. ఎంపీడీవో నూర్జహాన్, తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, ఎంఈవోశోభావివేకవతి, పంచాయతీరాజ్ డీఈ నాగరాజు పాల్గొన్నారు.