Share News

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:01 PM

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు.

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ

ఆదోని, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. ఆదోనిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సమన్వయంతో పని చేస్తూ గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల సృష్టికి ప్రాధాన్యమిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో నాయకుడు మల్లికార్జున పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2026 | 11:01 PM