అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:17 AM
గ్రామాల అభివృద్ధి, సంక్షేమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శనివారం అర్జునాపురం గ్రామంలో పర్యటించారు. ఎస్సీ కాలనీలో శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన మెఎ్మల్యే స్థలాన్ని పరిశీలించి 4 నెలల్లో శ్మశాన వాటిక ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు.
దొర్నిపాడు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధి, సంక్షేమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శనివారం అర్జునాపురం గ్రామంలో పర్యటించారు. ఎస్సీ కాలనీలో శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన మెఎ్మల్యే స్థలాన్ని పరిశీలించి 4 నెలల్లో శ్మశాన వాటిక ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. బీసీ కాలనీలో తాగునీటి సమస్య ఉందని తెలపడంతో 4 రోజుల్లో బోర్లు, పైపులైన్ మరమ్మతులు చేయిస్తానని అన్నారు. పింఛన్‌లు, సీసీ రోడ్లు తదితర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అర్జునాపురం నుంచి నందింపల్లెకు రూ.53 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఎంపీడీవో సావిత్రి, ఈవోపీఆర్డీ శివప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో చంద్రమౌళి, మాజీ సర్పంచ్ భూమా ప్రభాకర్‌రెడ్డి, పుల్లయ్య, బాబయ్య, మండల సెక్రెటరీ కొత్తపల్లి సురేంద్ర, డిస్ట్రిబ్యూటరీ ఉపాధ్యక్షుడు లింగుట్ల వెంకట్‌నాయుడు, ఆలయ ధర్మకర్త ఎండూరి గోపాల్‌నాయుడు, సొసైటీ అధ్యక్షుడు, సిద్ధి సత్యం, దూదెకుల బాల ఉసేని, బాబయ్య, భూమా హర్షవర్ధన్‌రెడ్డి, సుబ్బరాయుడు, చలమయ్య, శివకోటేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.