Share News

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - May 14 , 2026 | 11:49 PM

అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషిచేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి

మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

కోవెలకుంట్ల, మే 14 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషిచేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని లింగాల గ్రామం సోమేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంత్రికి గ్రామనాయకులు ప్రతాప్‌ రెడ్డి, భూపాల్‌ రెడ్డి, లింగాల నాయుడు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి కోవెలకుంట్లకు వెళ్తుండగా మార్గమధ్యంలో చిన్నకొప్పెర్ల, పెద్దకొప్పెర్ల గ్రామాల్లో రోడ్డుపై మురుగును చూసి ఆగారు. మురుగు రోడ్డుపై ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోవెలకుంట్ల గెస్ట్‌హౌ్‌సలో గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని చెప్పారు. త్వరలో నిర్వహిచనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ మధుసూదన్‌, ఎంపీడీవో వరప్రసాదరావు, తహసీల్దార్‌ పవన్‌ కుమార్‌ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో ప్రకాష్‌ నాయుడు, కోవెలకుంట్ల సొసైటీ చైర్మన్‌ గువ్వల సుబ్బారెడ్డి, కలుగొట్ల అర్జున్‌ రెడ్డి, రేవనూరు నరసింహారెడ్డి, నాగిరెడ్డి, వల్లంపాడు సర్పంచ్‌ జగదీశ్వర్‌ రెడ్డి, గుళ్లదుర్తి రవీంద్రనాథ్‌ రెడ్డి, గడ్డం నాగేశ్వర్‌ రెడ్డి, మురళీ, బిజనవేముల హుస్సేనయ్య, రాధ క్రిష్ణమూర్తి, పెనుగొండ రాజశేఖర్‌, సీఐ హనుమంత నాయక్‌, ఎస్‌ఐలు మల్లికార్జున్‌ రెడ్డి, రమణయ్య, ధనుంజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2026 | 11:49 PM