అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:17 AM
గ్రామాల అభివృద్ధి, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అఖిలప్రియ
చాగలమర్రి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధి, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఆదివారం చాగలమర్రి లో రూ.68 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు, స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. మండలంలో మొదటి విడతగా రూ.2.50 కోట్లు, రెండో విడత రూ.50 కోట్లు నిధులు మంజూరు చేశామని, గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మరో ఆరు నెలలు ఆగండి గ్రామాల్లో అభివృద్ధి అంతా అయిపోయికా రాజకీయం మొదలు పెడతామని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుంటే మేము సింహాం సింగిల్‌గా పోటీ చేస్తామంటూ మాట్లాడారని, ఇప్పుడు మరి ఆ సింహాలు ఎక్కడ ఉన్నాయో జూలో ఉన్నాయో అడవిలో ఉన్నాయో అసెంబ్లీకి మాత్రం అనంతరం మాజీ జడ్పీటీసీ రామ సుబ్బయ్యను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, అన్సర్‌బాషా, సల్లానాగరాజు, కొలిమి ఉసేన్‌వలి, మాబుషరీఫ్, ముల్లా అజిమ్, మౌళాలి, కార్యదర్శి అనిఫ్, అస్రఫ్, రమేష్, మాబులాల్, నాగరాజు, నరసింహులు, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో తాహిర్‌హుసేన్, డిప్యూటీ ఎంపీడీవో తారకేశ్వరి, ఎంఈవో శేషశయనారెడ్డి, ఏఈలు కొండారెడ్డి, నవీన్ పాల్గొన్నారు.