అభివృద్ధి, సంక్షేమం అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:13 AM
అభివృద్ధి, సంక్షేమ పథకాలు అంధించడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు
డోన్ టౌన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమ పథకాలు అంధించడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. బుధవారం వైఎస్ నగర్‌లో రూ.20లక్షల తో చేపట్టనున్న సీసీ డ్రైయిన్ల నిర్మాణం, పాతపేటలోని రూ.23 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని, ప్రజలకు మెరుగైన రవాణా, పారిశుధ్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ది, సంక్షేమ పాలన అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. గత వైసీపీ పాలన విధ్వంసం, అరాచకాలతో సాగిందని ఆరోపించారు.
అనుంపల్లి గ్రామంలో పల్లెపండుగ 3.0 నిధులు రూ.10 లక్షలతో, మిద్దెపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైయిన్ల పనులకు భూమి పూజ చేశారు.
టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్
ఎద్దుపెంట మాజీ సర్పంచ్ సిద్దార్థ కృష్ణారెడ్డి బుధవారం ఎమ్మెల్యే కోట్ల సమక్షంలో టీడీపీలో చేరారు. మండలంలోని ఎద్దుపెంట గ్రామంలో ఎమ్మెల్యే అభివృద్ది పనులకు భూమిపూజ చేసి, అనంతరం తాగునీటి ట్యాంకును ప్రారంభించారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఉత్తమ రైతులను సన్మానించి వారితో సహపంక్తి భోజనం చేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో రూ.కోట్ల వ్యయంతో ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, జిల్లా ఉపాద్యక్షుడు సలీంధ్ర శ్రీనివాసులు యాదవ్, ఓబులాపురం శేషిరెడ్డి, కోట్రికే ఫణిరాజ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టీఈ కేశన్నగౌడు, కోట్రికే హరికిషన్, కమలాపురం మాజీ సర్పంచ్ రేగటి అర్జున్ రెడ్డి, టీఈ రాఘవేంద్రగౌడు, శేషఫణిగౌడు, సుదీష్, భారతి, ఎన్‌ఈ సరోజ, దేవరబండ వెంకట నారాయణగౌడు, భాస్కర్ నాయుడు, అభిరెడ్డిపల్లె గోవిందు, మిద్దెపల్లె గోవిందు, సీమ సుధాకర్ రెడ్డి, ఎద్దుపెంట ఈశ్వరయ్య, ఆర్డీవో కేపీ నరసింహులు, పీఆర్ డీఈ గంగార్, ఏఈ నారాయణ పాల్గొన్నారు.