Share News

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:27 AM

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఓర్వకల్లు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కాల్వ గ్రామంలో జల్‌జీవన మిష న పథకం ద్వారా రూ.1.11 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 90వేలు, 40వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ ట్యాంకులు, పైపులైన్ల పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం కాల్వబుగ్గలో రూ.40 లక్షలతో నిర్మించబోతున్న వాటర్‌ ట్యాంక్‌ను ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌ భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేస్తామన్నారు. జల్‌జీవన మిషన ద్వారా గ్రామా ల్లోని ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందిస్తామన్నారు. ఎనఆర్‌ఈ జీఎస్‌ పల్లె పండుగ కార్యక్రమం ద్వారా 1, 2 విడతల్లో రూ.60 లక్షల సీసీ రోడ్లు, మూడో విడతలో రూ.10 లక్షలు, హుశేనాపురం నుంచి బ్రాహ్మణపల్లెకు రోడ్డు నిర్మాణానికి రూ.2.60 కోట్లు, రిల యన్స సంస్థ ద్వారా కాల్వ, హుశేనాపురం, బ్రాహ్మణపల్లెను దత్తత తీసుకున్నా మన్నారు. ఈసందర్భంగా గౌరు చరితారెడ్డి, మల్లెల రాజశేఖర్‌ను గ్రామస్థులు అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, ఆకుల మహేష్‌, మాజీ ఎంపీపీ లక్ష్మణ రావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ అమల, ఎంపీడీవో నాగ అనసూయ, సొసై టీ అధ్యక్షుడు సుధాకర్‌రావు, ట్రెజరర్‌ మహబూబ్‌ బాషా, కాల్వబుగ్గ చైర్మన కాటినేని నారాయణ, మాజీ చైర్మన జికే సుధాకర్‌, నాయకులు కాకి దేవేంద్ర, నాగముని, ఖాదర్‌బాషా, షాలు, బచ్చుమియా, బషీర్‌, పాతిమాబీ, గని మహమ్మద్‌ హుశేన, గువ్వ రవి, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:27 AM