Share News

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:29 AM

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు అర్బన 34, 36 వార్డుల్లో సోమవారం రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పార్థాగ్రాండ్‌, రాజీవ్‌గృహ కల్పలో ఇం టింటికీ తిరిగి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. 36వ వార్డు కోడు మూరు మెయిన రోడ్డు నుంచి రాజీవ్‌గృహ కల్ప వరకు రూ.65లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి గౌరు చరితారెడ్డి శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్‌ హామీలను ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం ట్రస్టు బోర్డు సభ్యురాలు పీయూ శివమ్మ, క్లస్టర్‌ ఇనచార్జిలు ఆర్‌.లోకేశ్వరరెడ్డి, పీయూ మాదన్న, 36వార్డు ఇనచార్జి ఆర్‌.తిరుమలేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, భాస్క ర్‌గౌడ్‌, కిరణ్‌కుమార్‌, నారాయణగౌడ్‌, పెద్దబీచుపల్లి, చిన్న బీచుపల్లి జవ్వాజి గంగాధర్‌గౌడ్‌, డీవీ చంద్ర, రఫి, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2026 | 12:29 AM