Share News

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:47 AM

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. బుధవారం కల్లూరు అర్బన 36వ వార్డు పెద్దపాడులో వెటర్నరీ హాస్పిటల్‌ నుంచి జిల్లా పరిషత హైస్కూల్‌ వరకు రూ.40లక్షలతో బీటీ రోడ్డు నిర్మా ణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ నగరంలో ప్రతివార్డులో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థ డీఈ మనోహర్‌రెడ్డి 36వ వార్డు ఇనచార్జి ఆర్‌.తిరుమలేష్‌రెడ్డి, క్లస్టర్‌ ఇనచార్జి ఆర్‌.లోకేశ్వరరెడ్డి, పరమేశ్వ రరెడ్డి, సుబ్బారెడ్డి, టి.శేఖర్‌, పెద్దబీచుపల్లి, చిన్నబీచుపల్లి, ఏ.నాగలాపురం టీడీపీ నాయకులు సుబ్బారెడ్డి, వేదాంతరెడ్డి, నరసింహా పాల్గొన్నారు. అనంతరం ఉల్చాల వై.జంక్షనలో చత్రపతి శివాజీ విగ్రహం, సర్కిల్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పరిశీలించారు.

Updated Date - Sep 17 , 2026 | 12:47 AM