అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:31 AM
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరి తారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరి తారెడ్డి అన్నారు. గురువారం కల్లూరు మండలం తడకనపల్లె నుంచి వామసముద్రం గ్రామానికి వెళ్లే సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.70 లక్షలతో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తిరిగి అభివృద్ది, సంక్షేమ కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ సహరాబీ, క్లస్టర్ ఇనచార్జి మాదేష్, ఉలిందకొండ సింగిల్‌విండో చైర్మన ఈవీ.రమణ, టీడీపీ నాయ కులు సుల్తానమియా, బషీర్, కోటి, జనసేన సలాం, ఐఖ్య సంఘం నాయ కులు జుబేదాబి, రామాంజినేయులు పాల్గొన్నారు.