అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:11 AM
అభివృద్ధి, సంక్షేమమే కూట మి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే కూట మి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను 29, 30 వార్డుల్లో సోమవారం ఇంటింటికీ తిరిగి వివరించి, కరపత్రాలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారన్నారు. కార్యక్రమంలో ఏపీ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన చైర్‌పర్సన కె.పార్వతమ్మ, బ్రాహ్మణ కార్పొ రేషన డైరెక్టర్ ఎస్‌కే. శ్రీనివాసరావు, వీరేంద్ర, రాఘవేంద్ర, రామకృష్ణ, లింగన్న, సర్ధార్, పుల్లయ్య, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.