Share News

ఆలయ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Mar 21 , 2026 | 01:16 AM

ఎర్రమల కొండల్లో వెలసిన లక్ష్మీ కంబగిరిస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆలయ అభివృద్ధికి కృషి
మినరల్‌ వాటర్‌ ప్లాంటును ప్రారంభిస్తున్న మంత్రి

అవుకు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఎర్రమల కొండల్లో వెలసిన లక్ష్మీ కంబగిరిస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి కునుకుంట్ల టీడీపీ నాయకుడు గూడాల ప్రతా్‌పరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి సొంత నిధులు రూ. 15 లక్షలతో నిర్మించిన మినరల్‌ వాటర్‌ ప్లాంటును ప్రారంభించారు. ఈనెల 29 నుంచి ఏప్రిల్‌ నెల 3 వరకు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలు ఉంటాయని, గతంలో ఇచ్చిన హామీ మేరకు భక్తులకు శుద్ధమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో వెయ్యి లీట్లు సామర్థ్యం కలిగిన ఆర్‌వో ప్లాంటును అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆర్‌డబ్యూఎస్‌ డీఈ మధుసూదన్‌, ఏఈ సాయిక్రిష్ణ, మండల టీడీపీ అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి, నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు మారం పుల్లారెడ్డి, టీడీపీ నాయకులు రామక్రిష్ణారెడ్డి, శ్రీనివాసులు, ప్రసాద్‌, రామచంద్రనాయక్‌, తౌర్యానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 01:16 AM