నగరంలో పార్కులను అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:47 AM
నగర ప్రజల మానసిక ఉలాస్లానికి పార్కులు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం సాయంత్రం వీనస్ కాలనీ పార్కులో రూ.45లక్షలతో నిర్మించనున్న ప్రహరీ, నడక మార్గం గ్రీనరీ ఏర్పాటు, 168 అడుగుల జాతీయ జెండా సీసీ కెమెరాల పనులకు శంకుస్థాపన చేశారు.
కర్నూలు కల్చరల్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): నగర ప్రజల మానసిక ఉలాస్లానికి పార్కులు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం సాయంత్రం వీనస్ కాలనీ పార్కులో రూ.45లక్షలతో నిర్మించనున్న ప్రహరీ, నడక మార్గం గ్రీనరీ ఏర్పాటు, 168 అడుగుల జాతీయ జెండా సీసీ కెమెరాల పనులకు శంకుస్థాపన చేశారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు వినియోగించుకునేలా అన్ని మౌళిక సదుపాయాలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నూతనంగా 6 పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ పథకాలను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. డి.సి. సతీష్ కుమార్‌రెడ్డి, ఎంఈ మనోహర్‌రెడ్డి, డీఈఈ క్రిష్ణలత, టీఏలు పవన్, రాజేశ్, బి. ఉదయ్, శానిటేషన్ ఇన్స్‌స్పెక్టరు మునిస్వామి పాల్గొన్నారు.