Share News

పార్కుల అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:10 AM

నగరంలో పచ్చదనాన్ని పెంపొందించి ప్రజలకు మెరుగైన విశ్రాంతి వాతావరణం కల్పించే దిశగా ఉద్యాన వనాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

పార్కుల అభివృద్ధికి చర్యలు
శంకుస్థాపన చేస్తున్న మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): నగరంలో పచ్చదనాన్ని పెంపొందించి ప్రజలకు మెరుగైన విశ్రాంతి వాతావరణం కల్పించే దిశగా ఉద్యాన వనాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూ.1.05 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఆరు పార్కుల పనులకు కమిషనర్‌ పి.విశ్వనాథ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడంలో భాగంగా ఒకే సారి ఆరు పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కమిషనర్‌ మాట్లాడుతూ 45వ వార్డులోని ప్రేమ్‌నగర్‌ పార్క్‌-2 రూ. 15లక్షలు, 44 వార్డులోని ఎంపీఎల్‌ ఎంప్లాయీస్‌ కాలనీ పార్కుకు రూ.15లక్షలు, ఎల్‌ఐసీ కాలనీ పార్కులకు రూ.25లక్షలు, 24వ వార్డులోని మధురానగర్‌ పార్కుకు రూ.15లక్షలు, 25వ వార్డులో బిర్లా భవన్‌ పార్కుకు రూ.20లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ సతీ్‌షకుమార్‌ రెడ్డి, ఎస్‌ఈ రమణ మూర్తి, డీసీపీ వెంకటరమణ, ఎంఈమనోహర్‌రెడ్డి, డీఈఈలు కృష్ణలత, పవన్‌, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్‌ బాషా పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:11 AM