నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:12 PM
నైపుణ్యాలను పెంపొందించుకుంటూ, వక్ప్ ఆస్తులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, టీజీ భరత్‌లు ముస్లింలకు పిలుపునిచ్చారు.
మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, టీజీ భరత్
కర్నూలు అర్బన్, మార్చి 10(ఆంధ్రజ్యోతి): నైపుణ్యాలను పెంపొందించుకుంటూ, వక్ప్ ఆస్తులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, టీజీ భరత్‌లు ముస్లింలకు పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని ఉస్మానియా కళాశాల సమీపంలోని టీజీ వెంకటేశ్ షాదీఖానా హాల్లో మంత్రి టీజీ భరత్‌తో కలిసి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు పరిధిలో విలువైన భూములు ఉన్నాయని, పట్టింపులు, తగాదాలకు పోకుండా వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వక్ఫ్ కమిటీ ఏర్పాటు చేయకపోవడం వల్ల ముస్లింలకు నష్టం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాము కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో జేసీ నూరుల్ ఖమర్, క్రిష్టియన్ కార్పొరేషన్ ఎండీ శేఖర్, జిల్లా మైనార్టీ అధికారి సబియా పర్వీన్ త దితరులు పాల్గొన్నారు.