Share News

అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Sep 01 , 2026 | 11:58 PM

నంద్యాల జిల్లాను అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

 అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న మంత్రి బీసీ

ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాను అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టఫణంలోని కస్బా ప్రాథమిక పాఠశాల, రంగరాజుపేట కాలనీలల్లో డీఎంఎఫ్‌ నిధులు రూ.64 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, అండర్‌డ్రైనేజీని ప్రారంభించారు. పట్టణంలో రూ.60కోట్లతో సీసీ రోడ్లు, అండర్‌డ్రైనేజీ పనులు చేస్తున్నామని, అలాగే జుర్రేరువాగులో మురుగు కలువకుండా రూ.13 కోట్లతో ఆధుకీకరణ చేస్తున్నామన్నారు. వాగులో చెక్‌డ్యాంలు నిర్మించి భూగర్భజలాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైసీపీ నాయకరులు కేవలం తమ ఉనికికోసమే విమర్శలు చేస్తున్నారన్నారన్నారు. రెండేళ్లలోనే బనగానపల్లె అభివృద్దికి సుమారు రూ.73 కోట్లు నిధులు ఖర్చుచేశామని, త్వరలో పేదలకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామన్నారు. బనగానపల్లెలో రూ.20 లక్షల సొంత నిధులతో 2 ఆర్‌వో మినరల్‌ ప్లాంట్లను నిర్మించామన్నారు. ఏరియా ఆసుపత్రికి రూ.40లక్షల విలువైన మెడికల్‌ పరికరాలు మంజూరు చేశామన్నారు. పట్టణంలో షాదీఖానా నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి కేటాయించగా, సొంత నిధులు మరో రూ. కోటి వెచ్చించి రూ.2కోట్లతో పనులలు చేపట్టామన్నారు. పట్టణణాన్ని జిల్లాలోనే ఆదర్శంగా రూపుదిద్దుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రత్యేకాఽధికారి చంద్రశేఖర్‌రెడ్డి, డీఈ నాగశ్రీనిసులు, ఏఈ వెంకటరమణ, బనగానపల్లె ఈవో మురళీమోహన్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 11:58 PM