విధ్వంసకర పార్టీలను బహిష్కరించాలి
ABN , Publish Date - Oct 19 , 2026 | 01:01 AM
విధ్వంసకర రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న పార్టీలను ప్రజలు బహిష్కరించాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి మాచాని సునీత నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమమే ద్యేయంగా పాలిస్తోందన్నారు.
ఎమ్మిగనూరు, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): విధ్వంసకర రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న పార్టీలను ప్రజలు బహిష్కరించాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి మాచాని సునీత నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమమే ద్యేయంగా పాలిస్తోందన్నారు. పట్టణంలో గుంతలమయంగా ఉన్న రోడ్డు, పాడైన డ్రైనేజీలను బాగుచేశాని, తాగునీటి ఇబ్బందులను తొలగించామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఓటమి భయంతో వైసీపీ విద్వంసకర దాడులకు పాల్పడుతోందన్నారు. టీడీపీ మహిళలకు ప్రాధాన్యమిస్తోందని, మున్సిపల్ చైర్మన్ పదవిని మహిళకు కేటాయించిందన్నారు. కూటమి పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన ఐక్యంగా పనిచేసి 44 వార్డులను గెలిపించి కూటమి పెద్దలకు కానుగా ఇస్తామన్నారు. పార్టీ పరిశీలకుగు మణిశేఖర్ రెడ్డి, ఏఎంసీ మల్లయ్య, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుగు బాస్కర్ల చంద్రశేఖర్, మిన్నప్ప, మచాని మహేష్, కమ్మ మహేంద్ర బాబు, నవాజ్, తురేగల్ నజీర్, బీజేపీ నరసింహులు, దయాసాగర్, జనసేన నవీన్ పాల్గొన్నారు.