Share News

జనసంద్రమైన రాంపురం

ABN , Publish Date - Jan 17 , 2026 | 01:11 AM

మండలంలోని రాంపురం గ్రామంలో శుక్రవారం జరిగిన రామలింగేశ్వర స్వామి రథోత్సవానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

జనసంద్రమైన రాంపురం
రథోత్సవానికి హాజరైన జనం

ఘనంగా రామలింగేశ్వరస్వామి రథోత్సవం

మంత్రాలయం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాంపురం గ్రామంలో శుక్రవారం జరిగిన రామలింగేశ్వర స్వామి రథోత్సవానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో గ్రామ పరిస రాలు భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారి ఉత్సవ మూర్తిని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి, సీతారామిరెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథం వద్దకు తీసుకెళ్లారు. రాంపురం జాతరలో శుక్రవారం రాత్రి కర్నూలుకు చెందిన సంగీత సాగర ఎస్‌కే జాఫర్‌బాషా, అలీ, లత, చిన్న, రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్య క్రమంలో నృత్య కళాకారులు, గాయనీ లత చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి, మిమిక్రీ, ఉర్రూతలూగించే జానపద నృత్యాలు భక్తులను అలరించాయి. ఇదిలా ఉండగా రచ్చ మర్రి, సుంకేశ్వరి గ్రామాలకు చెందిన జడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీ టీసీలు మజ్జిగ నరసమ్మ, జయలక్ష్మి, సర్పంచ మేకల సుజాత, ముక్క రన్న, అంజనేయులు, అయ్యప్ప ఆధ్వర్యంలో రాంపురంరెడ్డి సోదరులకు భారీ గజమాలతో సత్కరించారు.

Updated Date - Jan 17 , 2026 | 01:11 AM