ప్రజాస్వామ్యం ఖూనీ
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:43 AM
బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని.. ఎన్నికల కమిషనర్ వెంటనే తొలగించాలని ఇండియా కూటమి నాయకులు ధ్వజమెత్తారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ సభ్యుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జె. లక్ష్మీనరసింహ యాదవ్, సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లెనిన్‌బాబు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జీలానీ భాషా అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.
రాజ్యాంగాన్ని బీజేపీ నాశనం చేసింది
ఇండియా కూటమి నాయకుల ధ్వజం
కర్నూలు అర్బన్ , అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని.. ఎన్నికల కమిషనర్ వెంటనే తొలగించాలని ఇండియా కూటమి నాయకులు ధ్వజమెత్తారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ సభ్యుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జె. లక్ష్మీనరసింహ యాదవ్, సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లెనిన్‌బాబు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జీలానీ భాషా అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఆర్‌ఎ్‌సఎస్ భావజాలం ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించిన బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని అన్నారు. ప్రధానీ మోదీ, అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని దేశాన్ని పాలించాలని చూస్తున్నారని అన్నారు. సీపీఎం కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలంగాణలో బీజేపీ అభ్యర్థి అరవింద్ ఎన్నికల ప్రచారంలో ఎవరికి ఓటు బటన్ నొక్కినా ఆ ఓటు తనకే పడుతుందని బహిరంగంగా ప్రకటించారన అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఎం. సుధాకర్ బాబు, మాజీ డీసీసీ కే. బాబు రావు, అనంతరత్నం మాదిగ పాల్గొన్నారు.