Share News

ఇళ్లను త్వరగా అందించండి

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:37 PM

జగన్నాథగట్టుపై ఉన్న టిడ్కో గృహల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల పనులు వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను త్వరగా అందించాలని టిడ్కో గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌కుమార్‌ రెడ్డి ఆదేశించారు.

ఇళ్లను త్వరగా అందించండి
టిడ్కో గృహలను పరిశీలిస్తున్న సంస్థ ఎండీ సునీల్‌కుమార్‌రెడ్డి

టిడ్కో గృహ నిర్మాణ సంస్థ ఎండీ సునీల్‌కుమార్‌

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): జగన్నాథగట్టుపై ఉన్న టిడ్కో గృహల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల పనులు వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను త్వరగా అందించాలని టిడ్కో గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌కుమార్‌ రెడ్డి ఆదేశించారు. గురువారం ఈ గృహలను సందర్శించిన ఆయన ప్రవేశ మార్గం, కూడలి అభివృద్ధి పనులను పరిశీలించి, వాటి పురోగతిపై అధికారులతో ఆరాతీశారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, కార్యనిర్వహణ ఇంజనీర్‌, ఉప కార్యనిర్వహణ ఇంజనీర్లతో సమావేశమయ్యారు. మౌలిక సదుపాయాల పనులు, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అన్నారు. అవసరమైన అదనపు సిబ్బందిని నియ మించి పనులను త్వరగా చేయాలని సూచించారు. నగర స్థాయి సాంకేతిక సమన్వయకర్తలతో సమావేశమైన గృహ రుణాల మంజూరు, నిర్ధారక రుణ ఖాతాలు, వాపసులు, డిమాండ్‌ సర్వే అంశాలపై సమీక్ష నిర్వహించారు కార్యక్రమంలో ఎస్‌ఈ ఆదినారాయణ, ఈఈ రవికుమార్‌ గుప్తా, సీఎల్‌టీసీలు పెంచలయ్య, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2026 | 11:37 PM