Share News

సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:08 AM

): సమస్యల పరి ష్కారంలో జాప్యం తగదని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబు లేసు అన్నారు.

సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
మాజీ మేయర్‌ బంగి అనంతయ్య నుంచి వినతి పత్రం అందుకుంటున్న కమిషనర్‌

నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): సమస్యల పరి ష్కారంలో జాప్యం తగదని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబు లేసు అన్నారు. స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి ఆయన 21 అర్జీలు స్వీకరించారు. కమిష నర్‌ మాట్లాడుతున్న అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాల న్నారు. అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఈ జే.రమణమూర్తి, డీసీపీ షబ్నమ్‌ శాసి్త్ర, ఏసీపీ నాగరాజు, కార్యదర్శి నాగరాజు, మేనేజర్‌ జునైద్‌, ఆర్‌ఓలు, వాజిద్‌, సర్వే యర్‌ మద్దిలేటి, టిడ్కో అధికారి పెంచలయ్య పాల్గొన్నారు.

ఫ బుధవారపేట హిందూ శ్మశాన వాటికను శుభ్రం చేయాలని మాజీ మేయర్‌ బంగి అనంతయ్య కోరారు. ఈ మేరకు కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ శ్మశానంలో పేరుకుపోయిన చెట్లను తొలగించాలని కోరారు. 21వ వార్డు ఉన్నతి విల్లాస్‌ వద్ద రోడ్డు నిర్మించాలని స్థానికుడు నవీనకుమార్‌ కోరారు.

ఫ స్థానిక వెంకటరమణ కాలనీలోని నగర పాలక కార్యాలయంలో నగరంలో ప్రతిపాదించిన 486 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన తుది జాబితాను కమిషనర్‌ చల్లా ఓబులేసు సోమవారం ప్రదర్శించారు. ఈ జాబితాను నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించనున్నట్లు కమిషనర్‌ తెలిపారు. డీసీపీ శబ్నం శాసి్త్ర, ఏసీపీ నాగరాజు, సూపరింటెండెంట్‌ సుబ్బన్న పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 12:08 AM