సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:38 AM
ప్రజల నుంచి వివిధ రూపాల్లో అందుతున్న అర్జీల పరిష్కారంలో జాప్యం తగదని నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు.
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వివిధ రూపాల్లో అందుతున్న అర్జీల పరిష్కారంలో జాప్యం తగదని నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. సోమ వారం స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమా నికి 19 అర్జీలు వచ్చాయి. కమిషనర్ మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదుల పరిష్కా రానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమి షనర్ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్‌రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ఎస్‌ఈ జే.రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డా.ఎం.రఘు, ఎంఈ మనోహర్‌రెడ్డి, మేనేజర్ జునైద్, సూపరింటెండెంట్ స్వర్ణలత, ఆర్‌వోలు వాజిద్ బాషా, క్రిష్టఫర్, ఏసీపీ నాగరాజు, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్‌బాషా, టిడ్కో అధికారి పెంచలయ్య, సర్వేయర్ మద్దిలేటి పాల్గొన్నారు.