సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:45 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే దరఖాస్తులను పరిష్కరించడంలో జాప్యం ఉండరాదని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
నంద్యాల నూనెపల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే దరఖాస్తులను పరిష్కరించడంలో జాప్యం ఉండరాదని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేధిక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం స్వీకరించిన ప్రతి అర్జీని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలిస్తుం దన్నారు. అర్జీల సంతృప్తి స్థాయిని ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. అధికారులు అర్జీదారులను వ్యక్తిగతంగా కలిసి సమస్యను పరిష్కరించేలా వ్యవహరించాలన్నారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా రెవిన్యూ అధికారి రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.