Share News

సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:57 PM

ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని నగర పాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ అన్నారు.

సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
వినతులు స్వీకరిస్తున్న అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ

నగర పాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ

కర్నూలు న్యూసిటీ, జూన 22(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని నగర పాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ అన్నారు. సోమవారం స్థానిక ఎస్‌బీఐ కాల నీలోని నగర పాలక సమా వేశ భవనంలో ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరిం చారు. ఆయన మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఈ జే.రమణమూర్తి, మేనేజర్‌ జునైద్‌, ఎంఈ మనోహర్‌రెడ్డి, ఇనచార్జి సిటీ ప్లానర్‌ వైవీ వెంకటరమణ, ఆర్‌ఓ స్వర్ణలత, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్‌ బాషా, టిడ్కో అధికారి పెంచలయ్య, సర్వేయర్‌ మద్దిలేటి పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 11:57 PM