రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:19 AM
: మండల కేంద్రంలోని ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో జాప్యం కనిపిస్తోంది. 15 రోజుల క్రితం పనులు ప్రారంభమైనా నత్తనడకన సాగుతున్నాయని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.
కాలువ తవ్వి వదిలేయడంతో స్థానికుల నరకయాతన
సంజామల, జూలై 6 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో జాప్యం కనిపిస్తోంది. 15 రోజుల క్రితం పనులు ప్రారంభమైనా నత్తనడకన సాగుతున్నాయని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఒకవైపు కట్టడాలను తొలగించి కాలువ కోసం అవసరమైన గుంతలను తీశారు. అనంతరం వాటిని పూర్తిచేయకపోవ డంతో ఇంటిలోకి వేళ్లేందుకు స్థానికులు అవస్థలు పడుతున్నారు. అధికారులు పనులను త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నారు.