Share News

జింకల దండయాత్ర

ABN , Publish Date - May 24 , 2026 | 12:21 AM

కోసిగి, సజ్జలగుడ్డం గ్రామాల సమీపంలో గల మార్లబండ ఆంజనేయస్వామి దేవాలయ పరిసర పొలాలపై జింకల బెడద తీవ్రమైంది. బోరుబావుల కింద ఎంతో కష్టపడి సాగు చేసిన ఉల్లి, వేరుశనగ, కాయగూరల పంటలను జింకల మందలు పూర్తిగా నాశనం చేస్తున్నాయి.

జింకల దండయాత్ర
వేరుశనగ పంటను నాశనం చేస్తున్న జింకల మంద

ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో పంటలు నాశనం

గుంపులుగా ఉల్లి, వేరుశనగపై దాడి

కోసిగి, మే 23 (ఆంధ్రజ్యోతి): కోసిగి, సజ్జలగుడ్డం గ్రామాల సమీపంలో గల మార్లబండ ఆంజనేయస్వామి దేవాలయ పరిసర పొలాలపై జింకల బెడద తీవ్రమైంది. బోరుబావుల కింద ఎంతో కష్టపడి సాగు చేసిన ఉల్లి, వేరుశనగ, కాయగూరల పంటలను జింకల మందలు పూర్తిగా నాశనం చేస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా పదుల సంఖ్యలో జింకలు గుంపులుగా ఒకేసారి వచ్చి పొలాలపై పడి చేతికొచ్చే పంటలను ధ్వంసం చేస్తున్నాయి. లక్షలాది రూపాయలు అప్పు చేసి సాగు చేసి, జింకలతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

రాత్రింబవళ్ల్లు కాపలా ఉన్నా తప్పని తిప్పలు..

మార్లబండ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఉన్న నా పొలంలో వేరుశనగ, ఉల్లి పంటలు వేశాను. జింకల మందలు పడి పంటను పూర్తిగా తొక్కి, మేసి నాశనం చేశాయి. పొలాల్లోనే రాత్రి, పగలు కాపలా ఉండాల్సి వస్తోంది. కనురెప్ప మూసి తెరిచేలోగా పదుల సంఖ్యలో జింకలు వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి. - కిందిగేరి గోవిందు, రైతు, కోసిగి

Updated Date - May 24 , 2026 | 12:21 AM