పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలి
ABN , Publish Date - May 18 , 2026 | 12:32 AM
పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని సీపీఐ మండల కార్యదర్శి శివయ్య డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని పొట్టిశ్రీరాములు కూడలిలో ధర్నా నిర్వహించారు.
బనగానపల్లె, మే 17 (ఆంధ్రజ్యోతి): పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని సీపీఐ మండల కార్యదర్శి శివయ్య డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని పొట్టిశ్రీరాములు కూడలిలో ధర్నా నిర్వహించారు. కొండపేటనుంచి ఆటోను తాడుతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. డీజిల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరుగుతాయన్నారు. సుబ్బారెడ్డి, ఎర్రిస్వామి, శివనాగయ్య, మతేశ్, ఎల్లేశ్వరమ్మ, స్వరూప, సుబ్బయ్య, రవి పాల్గొన్నారు.
బేతంచెర్లలో సీఐటీయూ నాయకుల రాస్తారోకో
బేతంచెర్ల: పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లయ్య, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుడు మద్దిలేటి స్వామి డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని పాత బస్టాండ్‌లో రామాంజనేయులు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఉన్నఫలంగా ధరలు పెంచి రూ.వేల కోట్ల భారం మోపడం సరికాదన్నారు. ఇరాన్, ఇజ్రాయేల్ యుద్ధాన్ని సాకుగా చూపి రాత్రికి రాత్రే పెట్రోల్, డీజిల్ ఽధరలు పెంచడం సమంజసం కాదన్నారు. నెల రోజుల క్రితమే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, పెట్రోల్ దిగుమతి చేసుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రిలయన్స్. అదాని, అంబానీలకు లాభాలు కట్టపెట్టడానికే బీజేపీ పాలక ప్రభుత్వం ధరలను పెంచిందన్నారు. ఆటో మద్దిలేటి, రాజబాబు, వెంకటరమణ, రాజు, వెంకటేశ్వర్లు, సుబ్బరాయుడు, రాముడు, తిరుమలేష్ ఉన్నారు.