Share News

డీసీసీబీలు బలోపేతం కావాలి

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:26 AM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఆర్థికంగా బలోపేతమైతేనే రైతులకు ప్రయో జనాలు చేకూరుతాయని ఆప్కాబ్‌ ఎండీ ఆర్‌వీ రామకృష్ణ అన్నారు.

డీసీసీబీలు బలోపేతం కావాలి
రికార్డులు పరిశీలిస్తున్న ఆప్కాబ్‌ ఎండీ రామకృష్ణ

కర్నూలు అగ్రికల్చర్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఆర్థికంగా బలోపేతమైతేనే రైతులకు ప్రయో జనాలు చేకూరుతాయని ఆప్కాబ్‌ ఎండీ ఆర్‌వీ రామకృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక డీసీసీబీ కార్యాలయంలో సీఈవో బాలాజీరావు, జీఎంలు రామాంజనేయులు, శివలీల, డీజీఎంలు, అధికారులతో రైతులకు అందిస్తున్న ప్రయోజనాలు, రైతులు ప్రజల నుంచి సేకరిస్తున్న డిపాజిట్లు, రుణాల పంపిణీపై ఎండీ సమీక్షించారు. సీఈవో బాలాజీరావు, జీఎం రామాంజనేయులు, ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో రైతులకు కల్పిస్తున్న రుణాలతో పాటు బ్యాంకు అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల వివరాలను ఎండీకి వివరించారు. ఎన్నడూ లేనివిధంగా ఉమ్మడి జిల్లాలోని 99 సహకార సంఘాలకు 20 లక్షల నుంచి కోటి వరకు నిధులను అందించి రైతులకు పంట రుణాలను రూ.30 కోట్ల దాకా అందించారన్నారు. పొలాల అభివృద్ధి, రైతులకు ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పెంచేందు కోసం ఒక్కో సహకార సంఘానికి రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు విడుదల చేశారన్నారు. ఇప్పటిదాకా రూ.275 కోట్లను అన్ని సంఘాలకు అందించామన్నారు. బ్యాంకు అభివృద్ధిలో ఖాతాదారుల విశ్వాసం అత్యంత ముఖ్యమన్నారు. ఆప్కాబ్‌ జనరల్‌ మేనేజర్‌ దినేష్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ లావణ్య, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, జనరల్‌ మేనేజర్లు రామాంజనేయులు, శివలీల, డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌ కుమార్‌, నాగిరెడ్డితో పాటు ఏజీఎం రాఘవేంద్రప్ప పాల్గొన్నారు. ఆప్కాబ్‌ ఎండీ రామకృష్ణ కల్లూరు సహకార సంఘాన్ని తనిఖీ చేశారు. ఆ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు. సంఘం అధ్యక్షుడు శేఖర్‌, కృష్ణానగర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ రమాదేవి పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:26 AM